18, ఫిబ్రవరి 2009, బుధవారం

ఆశలు

పగ్గములు ఎరుగనాశల
మగ్గము లొలికిన వలువలు మనసుకు తొడిగీ
బుగ్గవగవి గుండె చెదిరె
నొగ్గితి నాతలనజునకు నొప్పక గాయం

ఆశలు జారెను భూమికి
ఈశుని జటలకు ఉరికిన ఈప్సిత జలగా
నాశము చెందిరి మనుషులు
లేశపు మాత్రపు పటిమయు లేకనె ఇలలో‌

4 కామెంట్‌లు:

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

ఆచార్య గారూ, ఒట్టి ' న్ ' గురువు కాదు. పక్కన అచ్చుతో కలిస్తే గురువవుతుంది. ' ఇలన్ ' అంటే ఒక లఘువు, ఒక గురువు మాత్రమే. ' అడిగెదనని ' పద్యాన్ని ఓ సారి జాగ్రత్తగా పరిశీలించండి. మీకే తెలుస్తుంది.

ఆత్రేయ కొండూరు చెప్పారు...

ప్రసన్న కుమార్ గారు తప్పును చూపినందుకు ధన్యవాదాలు. దిద్దుకున్నాను. ఈ 'అడిగెదనని ' పద్యం ఏమిటో అర్ధంకాలేదండీ. వివరించగలరు.

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో లక్ష్మీదేవితో పాచికలు ఆడుకొంటుండగా ఆయనకి ఉన్నటుండి గజేంద్రుడి ఆర్తనాదం వినిపించింది. అప్పుడయన ఆటని అక్కడే వదిలి పరిగెట్టాడు. అప్పుడు లక్ష్మీదేవి
అడిగెదను + అని = " ఎక్కడికి వెళ్తున్నావయ్యా చెప్పాపెట్టకుండా అని అడుగుతాను అని " కడు వడి జను = చాలా వేగంగా వెళ్తోంది. అడిగిన = అడిగితే తన మగడు నుడువడని = తన భర్త చెప్పడని తడబడుచున్ = తడబడుతూ అడుగిడ = అడుగు + ఇడ = అడుగు పెడితే జడ ముడి తడబడు = కొప్పు కదులుతోంది. అడుగిడు = అడుగేస్తోంది అడుగిడదు = ఆగుతోంది జడిమ = స్త్రీ ( లక్ష్మీదేవి ) అడుగిడ నెడలన్ = అటూ ఇటూ వెడుతోంది.

ఆత్రేయ కొండూరు చెప్పారు...

ఫణి గారు ధన్యవాదాలు. నాకు ఇప్పుడు అర్ధమ్ అయ్యిన్ది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి