9, ఫిబ్రవరి 2009, సోమవారం

వేదన

అడగక ఎగబడు అలెపుడు
కడలిని వదలని విధముగ, కనులలొ తిరిగే
వడలని మన చెలిమి తలపు ,
కడవరకు నను విడదనెద కధ ఇది కాదే

తడి ఆరని నా చెంపకు
కడు అందమమరె చివరకు కడలి తటము లా
కొడిగట్టిన కంటి ఎరుపు,
పడిలేచే కెరటములట పడమటి చూపూ

పద పద మనవెద పలుకులు
మధువొల కనిపద సుధలును మనకధ కనుకే
వదలక వదరెడి నలతలు,
మెదలని పెదవులు, విరుగుడు మనసుకు ఎపుడో

2 కామెంట్‌లు:

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

ఈ పద్యాలు చదివితే పోతన భాగవతం లో ఓ పద్యం గుర్తుకు వచ్చిందండి.

గజేంద్రుణ్ని రక్షించడానికి ఏమీ చెప్పకుండా కదలి పోతున్న మగడి వెనుక పోయిన లక్ష్మీ దేవి స్థితి యిది.

అడిగెదనని కడు వడి జను
అడిగిన తనమగడు నుడువడని తడబడుచున్
అడుగిడ జడముడి తడబడు
అడుగిడు నడుగిడదు జడిమ అడుగిడునెడలన్

ఆత్రేయ కొండూరు చెప్పారు...

ఓ మంచి పద్యం గుర్తుకు తీసుకు రాగలిగి నందుకు ఆనందంగా ఉంది.

న్ అన్నది గురువన్న మాట. నాకు అది ఇప్పుడే తెలిసింది. ఇక దాన్ని చెడా మడా వాడేస్తా !!

ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి