3, ఫిబ్రవరి 2009, మంగళవారం

నవరసాలు - భక్తి

సమసిన ఆశల దీపము
సమయము ఆగక సలిపెను సమరము నపుడే
సమయో చితమ్ము నెరుగక
సమర్ప ణతమకు నొసగితి సరసిజ నయనా !!

దరిచూపుము ననుగావుము
పరిపాలకుడవనినమ్మి పలికితి శరణం
కరిగాచిన విభుడవు కని
కరమున కావుము తనయుని కమలదళాక్షా !!

3 కామెంట్‌లు:

జిగురు సత్యనారాయణ చెప్పారు...

"సమర్ప ణతమకు జేసితి సరసిజ నయనా !!"

"జేసితి" - ఆరవ గణము జగణము కాని నలము కాని కాలేదు. భగణము అయినది.

ఆత్రేయ కొండూరు చెప్పారు...

సత్యనారాయణ గారు ధన్యవాదాలు. తప్పు సవరించుకున్నాను.

కామేశ్వరరావు చెప్పారు...

మొత్తానికి కందాన్ని అదుపులోకి తెచ్చుకున్నారు! బావున్నాయి పద్యాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి