3, ఫిబ్రవరి 2009, మంగళవారం

నవరసాలు - భయానకం

పదవులె వారికి తెలియును
పదుగురు కిచ్చిన పలుకులు పరపతి కోసం
కదలిరి దేశము నేలగ
చెదవలె పాకుతు దిశలకు చెయ్యగ నాశం

సత్యము లస్సలు పలకరు
హత్యలు పలుజే సిరంట హతవిధి ఇలలో
భత్యము చాలక నేతలు
నిత్యము అవినీతి మరిగె నిక్కము కంటే

2 వ్యాఖ్యలు:

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

అందమగు బాపు బొమ్మల
చందముగా కూర్చి మీరు చదువరులెల్లన్
డెందము పొంగగ మెచ్చగ
కందములను వ్రాసినారు కవి ఆత్రేయా !

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

'నిత్యము సల్పిరవినీతి నిక్కము కంటే' అంటే 4వ పాదం లో 2వ గణం జగణం రాకుండా ఉంటుంది.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి