6, ఫిబ్రవరి 2009, శుక్రవారం

కంద పప్పులో కాలేసి భీభత్సం చేసిన పదో రసం

నవరసములంటు బాగుగ
నవ కవితల నే లిఖింప ! నకటా... కంటే !!
నవరసముల పై నొక రస
మవపడె నది భీభతిసయమయెగా నిజమే ?

పెద్దలు చెపుదురు , నాతల ,
మద్దెల బాదుడు, తలంటు, మంగలి పనికో,
పెద్దగ కనబడుట కొరకొ,
నద్దము కడ సవరణలకొ , నున్నది. దయతో !!

నవ రసాల పేర్లు: శృంగారం హాస్యం కరుణ వీరం శాంతం భక్తి భయానకం రౌద్రం అద్భుతం భీబత్సం
మరి ఇవి పది గదా ? నేనెక్కడ ఈ కాలేశాను ?

1 వ్యాఖ్యలు:

జిగురు సత్యనారాయణ చెప్పారు...

"భక్తి" భావమే. రసము కాదు. పెద్దలు దీన్ని "శాంత రసము"గా భావిస్తారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి