గతోదయం
-
రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది
విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.
కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడం...
26, మార్చి 2009, గురువారం
విరోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అయ్యా విరోధి గారూ
తయ్యారా మీరు మమ్ము తడపగ సుఖమున్
వయ్యా రి వసంత మెపుడొ
వుయ్యాలలొ ఊపెమమ్ము ఉబలాటంగా
నూతన వత్సరమును మన
వేతలు దీర్చ మని, లోని వేదన దీయన్
చేతల ఆశలు నింపగ
పూతలు పాదములజల్లి పూజించెదనే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 కామెంట్లు:
మీకు..మీ కుటుంబానికీ..ఉగాది శుభాకాంక్షలు..!
మన నూతన సంవత్సర శుభాకాంక్షలు,మీ ఇంటిల్ల పాది ఈ నూతన సంవత్స్రరం లో ప్రేమామృత పచ్చడి పంచుకొని ఆనందించండి.
మీకు, మీకుటుంబ సభ్యులందరికి ఉగాది శుభాకాంక్షలు
ఓ దివ్య వినూత్న జ్యోతి, ఓ స్వరరాగ సుధా మధుర వాణి, ఓ సులలిత సాంగత్య ఝరి అమ్మఒడి.. విచిత్రం కలిసి నా సంకట విరోధికి స్వాగతాలు పలికారు.. ఆడపడచులకు ధన్యవాదాలు. ముగురమ్మలకు ముక్కోటి ప్రణామాలు
మీరు పద్యాలుకుడా చాలాబాగా రాస్తారు . మికు, మీకుటుంబ సభ్యులందరికి విరోదినామసంవత్సర శుభాకాంక్షలు
nice.keepit up.
https://goo.gl/Yqzsxr
plz watch and subscribe our channel
కామెంట్‌ను పోస్ట్ చేయండి