10, మార్చి 2009, మంగళవారం

పల్లె సాయంత్రం -- చివరి భాగం


ఇల్లొది లిన ఆకర ణం
పిల్ల, అలిగిన మునసబు పెళ్ళాము గోడు
తల్లిని గొట్టిన కొడుకులు
కల్లుగు డిసెలో నదాగి కలిసిన అయ్యా

వదలని లాకుల కధనం
కదలని అల్లుని ఘనతలు కరగని అప్పున్‌
చెదిరిన కూతురు పెళ్ళియు
బెదిరిం పులసె ట్టిమాపు బకాయి కోసం

గాదెలొ ఎలుకల బాధలు
వీధిలొ వెలుగుట మరిచిన విరిగిన దీపం
సోదిలొ వచ్చిన తాతలు
రోదన మిగిలిన మరదలి రోకటి పోరూ

ఈవిధి ఒకటా రెండా
కోవిదు లుగదమ రి అచట కొల్వగు వారున్‌
వావివ రుసలుగ లుపుదురు
జీవిత పాఠము లునేర్పు జీవులు వారే

తీర్పులు జెప్పుదు రక్కడ
నేర్పుగ పలుకుతు జనులకు నేర్పుతు నీతిన్‌
ఓర్పుగ జేరిన పెద్దలు
చేర్పులు జేతురు నడవడి చేరిన సభలో

పల్లెలు వెనకన వదులుతు
కొల్లలు గయువత నగరపు కొలువులు జేరీ
మెల్లగ మరవగ, పల్లెలు
చిల్లర పెంకుల బరువుకు చిత్తయె నకటా

మోడయి మిగిలిన కూడలి
బీడయె నాకూ డలిసభ బీదగ జూస్తూ
తోడయె మేకలు కుక్కలు
ఆడకు చెప్పగ తమతమ ఆకలి అరుపున్‌

1 వ్యాఖ్యలు:

శ్రుతి చెప్పారు...

పెద్దల మాట చద్దన్నం మూట అని చెప్పేది అమ్మ. అప్పట్లో అర్దం కాలేదు. అర్దమయ్యి తిరిగి చూసుకుంటే ఆ పెద్దలే అందనంత దూరంలో కరుణ కరువైన జనారణ్యంలో ఒంటరిగా, అచ్చంగా బీడైన పల్లెలా ఉన్నాం.
నిజాన్ని చక్కగా చాలా బాగా చెప్పారు.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి