25, మార్చి 2009, బుధవారం

ఎప్పుడూ సమస్యా పూరణల లేనా..--...ణరపూ స్యామస ...

కాస్త వైవిధ్యం చూపుదామా ?

పూరణ నిస్తున్నాను.. అర్ధము తెలిసి.. సందర్భాన్ని, సమస్యను వెదకండి.

సమస్యా పూరణం కాదిది సమాధాన శోధనం


కం:
అంజని కాల్బడ రాముడు
రంజిలె సీతమ నమందు రక్షకుడ తడనన్
అంజలి ఘటించె హరి యరి
భంజకుడతనని వగచెను భయమును బొందెన్‌


 ఇది ణరపూ స్యామస ... అన్న మాట :-)

1 వ్యాఖ్యలు:

ఆత్రేయ చెప్పారు...

బ్లాగు మిత్రులెవరూ ఇది చూసినట్టులేదు ఉగాది హడావిడిలో పడి. లేకపోతే నచ్చలేదో...

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి