గతోదయం
-
రాత్రి కణికల శయ్య మీద
అలసి వాలిన తనువు
ఆవిరవుతుంది
విడవని గతం
వీస్తూనే ఉంది
నివురు రేపుతూ
నిప్పు రగుల్చుతుంది.
కోట గోడలు పాడే
ఆ పదును గీతాలు
సేద తీర్చడం...
5, మార్చి 2009, గురువారం
జులాయి - కందం
చల్లని ఓ సాయంత్రం
మల్లెలు జడన దురిమినొక మగువను జూస్తూ
మెల్లగ మాటాడ బోతిని
నల్లని తనకన్ను గీటి నిలకడ నిలవన్
చెంతకు పోగా నవ్వుచు
వింతగ నన్నామె చూస్తు వివరము అడిగీ
దొంతరులుగ నవ్వి పలుక
చింత పులుపు టెంకె నోటి చివరకు తోసెన్ !!
తెల్లని కన్నుల చిన్నది
చల్లని చెక్కిలి మెరవగ చవులూరిస్తూ
మెల్లగ నోరాడించగ
వెల్లువ కాగా తపనలు వెళ్ళితి దరికిన్
మెల్లగ జేరి తనకడకు
తెల్లని నా పలువరసను తెల్లము జేస్తూ
సెల్లుని ఆపిన ఆమెను
ఉల్లము చల్ల బడగ గంటి ఉస్సూరంటూ !!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్‌లు:
:) :) :( :( ........
కామెంట్‌ను పోస్ట్ చేయండి