30, జనవరి 2009, శుక్రవారం

నవరసాలు - కరుణ





చెరగదు విరహము ఎదలో
కరగదు ప్రేయసి ఎడదయు కన్నీటి సుధలో
మరువగ నామది ఈకధ
మరణము పిలిచిన కదలదు ముక్తిక ఎపుడో

చెలిమిని గోరితి నేనని
చెలి పలికిన పలుకులు విన పడగా
చెలమలు రేగగ కనులం‌
జలి ఘటించెచు వగచి అలిసెను చెలియా

నెచ్చెలి పిలవగ ఈతరి
వచ్చితి చలిలో నిపుడు వగచుచు తనకై
వెచ్చటి పగలును వదిలి
పిచ్చేమి ఇపుడిటు పిలవగ పలకవె చిలకా




2 కామెంట్‌లు:

పుష్యం చెప్పారు...

కం//
అందముగ మీరు వ్రాసిన
కందములవి అదిరెనండి, కవి ఆత్రేయా!
అందందున తప్పె యతులు,
ఛంధస్సును మీరు మరల సరిచూడండీ

కం//
అల్లిన పద్యములందున
హల్లుకు మరి దానిమీద అచ్చుకు కూడా
చెల్లించగవలె యతులను
ఎల్లప్పుడు శ్రద్ధతోడ ఇలలో శ్యామా!


హల్లుకు యతి కుదుర్చునపుడు దానితో కూడిఉన్న అచ్చుకు కూడా యతి కుదర్చవలెను. ఉదాహరణకు 'పిచ్చేమి' లోని 'పి' (ప+ఇ) కి యతి కుదుర్చునపుడు, 'ప' తో పాటు 'ఇ' కి కూడా యతి కుదరవలెను. 'ఇ' కి 'ఇ, ఎ' లతో యతి కుదురునుకావున, 'పి' కి 'పి, ఫి, బి, భి, వి, పె, ఫె, బె, భె, వె' లతో యతి చెల్లుతుంది.

ఆత్రేయ కొండూరు చెప్పారు...

పుష్యంగారు ధన్యవాదాలు. కందం అందంగా ఉందికదా అని దూకాను. లోతు ఇప్పుడు తెలుస్తుంది. ఐనా నాకు పెద్దలు ఇంతమంది ఊతమిస్తున్నప్పుడు సాధించగలనన్న నమ్మకంకూడా కలుగుతుంది. మారందర్శన చేస్తున్న పెద్దలందరికి పాదాభివందనాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి