30, జనవరి 2009, శుక్రవారం

నవరసాలు - హాస్యం

పరిచిన వెన్నెల తోటన
విరిసిన కలువటు పిలవగ విరహము రేగీ
మెరిసిన కన్నుల వెలుగున
పరువము గ్రోలగ పరుగిడి పడితిని తెలుసా !!

జున్నును తినంగ గోరితి
కన్నులు నిండెను మిరియపు కఠినత తోడై
కన్నును గీటిన చిన్నది
వెన్నుని జూపిన విధమున వినవే కఠినా

4 కామెంట్‌లు:

ఊకదంపుడు చెప్పారు...

...
ఇక నే చెప్పేదేముంది..
పడితి నౌరా అన్నపుడు ఒక మాత్ర తగ్గింది చూడండి

ఆత్రేయ కొండూరు చెప్పారు...

ఊదం గారు సరి దిద్దుకున్నాను పరికించండి.

Unknown చెప్పారు...

రెండు, మూడు పాదాలు రెంటిలో "కన్ను" రాకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో. ఇంతకీ, "కన్నును గీటిన చిన్నది వెన్నుని (కృష్ణుని) జూపిన విధము" అంటే కొంచం వివరిస్తారా?

ఆత్రేయ కొండూరు చెప్పారు...

కె గారు ధన్యవాదాలు.
వెన్నుచూపటం అంటే విముఖత చూపడమన్న భావంలో వాడాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి