అటుతారాధిపు లిరువురు ఆదరి తిరగన్
అటునిటు నేమని తెలుపను
వ్వెటు తిరిగిన చెదిరె ఎద సఖియా
శిగలో మల్లెలు దురిమి
పగడపు మెరుపులు గలిగిన పెదవులు జూపీ
మగతను, మన్మధుడిచ్చిన
సెగలతొ ఇలనీ విధమగ సేయకు లలనా
ఊదం గారికి ధన్యవాదాలతో !!
తప్పులను పెద్దలు దిద్దగలరని నా ఆకాంక్ష ఆ ఆశతోనే ఈ చిన్న ప్రయత్నం. ఏదో నా మిడిమిడి పాండిత్యంతో తాతల ముందు దగ్గుతున్నాను.
2 కామెంట్‌లు:
అయ్యా, ఈ రసం గురించి నాకు పెద్దగా తెలీదు, మిరు రాసిన దానితో ఆక్షేపణా లేదు గానీ,
దీన్ని కంద పద్యం చేయవచ్చేమో చెబుతాను , పెద్ద మనసుతో మన్నించండి
దీనికి నల గగ భ జ స అనే గణాలు చెల్లుతాయి
మీరు మొదటి పాదం లొ ఒక లఘు తగ్గింది రెండు "నల" లకి ..
ఇటు తిరుగంగొక బింబము -> అంటే నల, భ, భ లతో మొదటి పాదం చెల్లుతుంది
ఇక రెండు నాలుగు పాదాలలో ఐదు గణాలుండాలి..
అటుతిరిగినచో ఇరువురు(?) అబ్బో -> అంటే రెందో పాదం లో మొదటి నాలుగు గణాలు చెల్లుతాయి.. ఐదవ గణం , గగ ( UU) గాని స ( IIU) కాని కావాలి.. నువ్వు, అంటే UI ఐనది ,
మూడవ పాదం మొదటి పాదం ని పోలి ఉండాటం చేత, ఒక గణము తగ్గినది
నాల్గవ పాదం రెండవ పాదాన్ని పోలి ఉంటుంది ..
అలానే తా కి - "తె" కి యతి చెల్లదు ( శ్రుగారం గురించి మాట్లడుతూ మధ్యలో యతులను ఎందుకు లాగటం లెండి, మరెప్పుడైనా మాట్లాడుకుందాం)..
నేనూ తాతను కాదు కానీయండి .... మిరు బాగా దగ్గాలని ఆకాంక్షతోనూ, మీ ఆఖరి వాక్యం చూసి మా యువకవులు నిశ్శబ్దం వహించారన్న శంకతోనూ చెబుతున్నాను ..
శీఘ్రమేవ ఛందోబద్ధ కందపద్య ప్రాప్తిరస్తు !!!
ఊదం గారూ తప్పులను ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. నేను ఇంకా నేర్చుకునే స్థాయిలోనే ఉన్నాను, మీరేమి చెప్పినా శిరోధార్యమే. పెద్దమనసు, మన్నించడం వంటి పెద్ద మాటలెందుకు లేండి. మీరిచ్చిన గుళికలు మింగి మరీ పెద్దగా దగ్గుతానని ఈ బ్లాగ్ముఖంగా విన్నవించుకుంటున్నాను. చివరి వాక్యం మారుస్తాను. మీకు మరోసారి ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి