12, జనవరి 2009, సోమవారం

నమస్సులు

పెద్దలందరికి నమస్సులు

తెలుగులో పద్యాలు రాయాలన్న తపన బాగా పెరగడంతో
పెద్దలు బ్లాగుల్లో రాస్తున్న పద్యాలను చదివి ఆనదించి స్పందించి. నేను కూడా మరోబ్లాగు పెట్టి అందులో
చిన్న చిన్నగా కంద పద్యాలు రాయాలన్న ఆశ నాచేత ఈ బ్లాగు చేయించింది.

నా తప్పులు సరి దిద్దుతారని, ఆశిస్తున్నాను.

6 కామెంట్‌లు:

ఫణి ప్రసన్న కుమార్ చెప్పారు...

ఆత్రేయ గారూ, చక్కటి బ్లాగ్ ప్రారంభించారు. ఇందులో అందమైన కందాలను చూడాలని ఆకాంక్షిస్తున్నాను. శుభాకాంక్షలు.

కామేశ్వరరావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కామేశ్వరరావు చెప్పారు...

సుందర బ్లాగ్వనమందున
కం(గం)దపు చెట్టింకొకటి సుగంధము దెసలన్
జిందన్ మొలిచెనె భళి భళి
ఎందులకాలస్యమింక హృదయకవీశా!

కొత్త పాళీ చెప్పారు...

కామేశ్వర్రావుగారు .. కందపు చెట్టు .. భలేభలే
ఆత్రేయ గారు, శుభస్య శీఘ్రం. ఈ సారి ఉగాది కవి సమ్మేళనానికి మీరూ పద్యాలతో తయారవ్వాలని మా ఆకాంక్ష.

జిగురు సత్యనారాయణ చెప్పారు...

కం. ఆత్రముగ నెదురు జూచెద
పాత్రంబగు మధుర కంద పద్యము కొఱకై
చిత్ర విచిత్రపు రీతిగ
ఆత్రేయా! నడుపుము కవితాశ్వమునింకన్!!

ఆత్రేయ కొండూరు చెప్పారు...

నెనరులు పెద్దలు ఔరా
కనికరమున రాసినారు కామెంటికడన్‌
కనిపించగలరు ఇక్కడ
సునిసిత మీ వాక్కుతోన స్పూర్తితొ నెపుడున్‌

కామెంట్‌ను పోస్ట్ చేయండి