
బ్లాగ్మిత్రులందరికి.. ..శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.
ఆదర్శ దంపతులు...శ్రీ సీతా రాములు మనందరిని చల్లగా చూడాలని ప్రార్ధిస్తూ...
సరదాగా రాసిన కొన్ని పద్యాలు...
సోదర సోదరీ మణులూ.. కోపగించుకోకండి.. సరదాగా రాసిన్వే.. అవధరించండి..
కం:
విల్లును విరిచావట ఆ
తల్లిని గెలిచితి వట అది తధ్యము నిజమే !!
చెల్లెను ఆ పనులపుడే
వల్లవునా ఇపుడు రామ వనితిను గెల్వన్ ?
మంటల దింపితి వామెను
అంపితివి గదా అడవికి అప్పటి యుగమున్
మంటలు మా పాలి ఇపుడు
కంటిలొ నలుసాయెనయ్య కలియుగ కాంతల్
అడవికి నీతో వచ్చెను
పడ దోసిన మంటలందు పరుషములనెనా ?
గడుసుగ మాటొకటను ఇపు
డు డమరములు మోగు నయ్య డస్సును చెవుల్ !!
(రాఘవ గారి చూపిన తప్పులు దిద్ది ఈ పద్యముని తిరిగి రాయడమయినది. ఆయనకు ధన్యవాదములు)
అడవికి నీతో వచ్చెను
పడ దోసిన మంటలందు పరుషములనెనా ?
గడసరి మాటన చెలితో
డ డమరములు రేగునయ్య ఢస్సును చెవుల్ !!
కంటకుడెత్తుకు పోగా
ఒంటరిగక్కడ వగచెను ఓరిమి గలదై
ఇంటిని వదిలిన గంటకు
కంటికి కనరావటంచు కరకుగ మోగున్ !! (ఫోను )
11 కామెంట్‌లు:
శ్రీరామ నవమి శుభాకాంక్షలు
శ్రీ రాముడి కుటుంబం,మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకొంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
ఆత్రేయ గారూ ! నిజం నిష్టూరం గా ఉన్నా ఒప్పుకు తీరాల్సిందే .... :) :)
శ్రీ రామనవమి శుభాకాంక్షలు ..
ఆత్రేయ గారూ,
బాగున్నాయండీ మీ పద్యాలు.
నిజమే రాశారు.
సోదరీమణులే సర్వత్రా సరిసరి అ౦టు౦టే ఇక తిరుగేము౦ది ఆత్రేయ గారు. మీ నిజాలు రామునికి పాఠాలు కాగలవు.
డమరములు మోగు నయ్య డస్సును చెవుల్
ఇది మాత్ర౦ పచ్చి నిజ౦. భలే నవ్వుకున్నాను ఇది చదివి.
(ఇ౦తకీ మీకు ఓ విన్నప౦ ప౦పాను. మీ నోటిఫికేషన్ ఈమెయిల్ లో చూసు౦టారని, మీ బ్లాగులో౦చి తీసేసాను. మీ జాబు చెప్పగలరు. anandb.surampudi@gmail.com)
విజయమోహన్ గారు, అమ్మఓడి గారు (మీ పేరు తెలుప గలరు), పరిమళం గారు, మందాకిని గారు, ఆనంద్ గార్లకు ధన్యవాదాలు. అక్షంతలెయ్యక ఆదరించినందుకు నెనరులు.
ఆనంద్ గారు. విన్నపం అందింది. కానీ ఈమెయిల్ లేక మీకు స్పందించలేదు. ఇప్పుడు తెలిసిందిగా.. మీకు ఈమెయిల్ చేస్తాను.
శ్రీరామనవమి శుభాకాంక్షలండీ.
కొన్ని ఉచితసలహాలు:
౧ ఓకే రకమైన భాష మొదటినుండి తుదివరకూ నడిస్తే బావుంటుంది. "విరిచావట గెలిచితివట" తో "విరచితివట గెలిచితివట" ని పోల్చి చూడండి.
౨ ఆమెను అంపు ఆమెనంపు అవుతుంది. దీనికి శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు అనుకుంటాను చెప్పిన పాఠం: "ఉకారం వస్తే సంధి చేసేయాలి. అకార ఇకారాలు వచ్చినపుడు సంధి చెయ్యడం చెయ్యకపోవడం మీ ఇష్టం" అని.
సంహితైకపదేనిత్యా నిత్యా ధాతూపసర్గయోః
నిత్యా సమాసే వాక్యేతు సా వివక్షా ముపేక్షతే
అని చెప్పబడింది కాబట్టి ఆమెను అంపు అని వాక్యంలో (వచనంలో) ఐతే వాడవచ్చు.
౩ "అడవికి నీతో వచ్చెను" పద్యంలో నాల్గవ పాదం గణాలూ యతీ ఒక్కసారి సరిచూడండి.
ఏదేమైనా మంచి ప్రయత్నం. అభినందనలు.
రాఘవ గారు ధన్యోస్మి. మీ వంటివారి సలహాలు నా శిరోధార్యములు. దాదాపుగా నా పద్యాలన్నీ ఆశువుగా రాసినవే. మరోసారి వాటిని దర్శించాలన్న అవసనరం ఉందన్న మీమొదటి సలహా ఇకపై పాటిస్తాను. భాషను ఒకేలా ఉండేటట్టు జాగ్రత్త పడతాను. నాకు తెలుగు వ్యాకరణము, ఇతర సాహిత్య ప్రవేశము లేకపోవడంవల్ల ఇటువంటివి దొర్లుతాయి (సంజాయిషీ కాదు.. తప్పు తప్పే.. ఇది తప్పని తెలియక దొర్లినవి ఇవి). తప్పకుండా దిద్దుకుంటాను. నాల్గవ పద్యం యతి సరిచేసుకుంటాను.
మీకు మరోసారి ధన్యవాదాలు. నా రాతల్లో మీకు కనిపించిన తప్పులు తప్పక ఎత్తి చూపుతారని ఆశిస్తూ.. భవదీయుడు.
jimbob మీరు రాసిన వ్యాఖ్యను తొలగించాను. ఇది అందుకు తగిన బ్లాగు కాదని. మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను. అన్యధాభావించకండి.
నాకంత పాండిత్య ప్రవేశం లేకున్నా
చక్కగా అర్ధమైంది...
మీ సరళ శైలి పూర్వకంగా...
ఎంచక్కగా వుందంటే...
అం చక్కగా...
అం చక్కంగా...
గ్రీటింగ్స్ సర్...
awesome poems
hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support
https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg
కామెంట్‌ను పోస్ట్ చేయండి