
బ్లాగ్మిత్రులందరికి.. ..శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.
ఆదర్శ దంపతులు...శ్రీ సీతా రాములు మనందరిని చల్లగా చూడాలని ప్రార్ధిస్తూ...
సరదాగా రాసిన కొన్ని పద్యాలు...
సోదర సోదరీ మణులూ.. కోపగించుకోకండి.. సరదాగా రాసిన్వే.. అవధరించండి..
కం:
విల్లును విరిచావట ఆ
తల్లిని గెలిచితి వట అది తధ్యము నిజమే !!
చెల్లెను ఆ పనులపుడే
వల్లవునా ఇపుడు రామ వనితిను గెల్వన్ ?
మంటల దింపితి వామెను
అంపితివి గదా అడవికి అప్పటి యుగమున్
మంటలు మా పాలి ఇపుడు
కంటిలొ నలుసాయెనయ్య కలియుగ కాంతల్
అడవికి నీతో వచ్చెను
పడ దోసిన మంటలందు పరుషములనెనా ?
గడుసుగ మాటొకటను ఇపు
డు డమరములు మోగు నయ్య డస్సును చెవుల్ !!
(రాఘవ గారి చూపిన తప్పులు దిద్ది ఈ పద్యముని తిరిగి రాయడమయినది. ఆయనకు ధన్యవాదములు)
అడవికి నీతో వచ్చెను
పడ దోసిన మంటలందు పరుషములనెనా ?
గడసరి మాటన చెలితో
డ డమరములు రేగునయ్య ఢస్సును చెవుల్ !!
కంటకుడెత్తుకు పోగా
ఒంటరిగక్కడ వగచెను ఓరిమి గలదై
ఇంటిని వదిలిన గంటకు
కంటికి కనరావటంచు కరకుగ మోగున్ !! (ఫోను )